Car Mileage Tips: కారు మైలేజీ రావాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి.. అవేంటంటే..?

Car Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎప్పుడో సెంచరీ కొట్టాయి. ప్రభుత్వ కృషితో కొంత తగ్గుదల వచ్చినా ధరలలో పెద్దగా మార్పు కనిపించలేదు.

Update: 2022-06-20 12:30 GMT

Car Mileage Tips: కారు మైలేజీ రావాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి.. అవేంటంటే..?

Car Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎప్పుడో సెంచరీ కొట్టాయి. ప్రభుత్వ కృషితో కొంత తగ్గుదల వచ్చినా ధరలలో పెద్దగా మార్పు కనిపించలేదు. అందుకే ఈ రోజుల్లో సొంత కారుని నిర్వహించడం కొంచెం కష్టమైన పనే. నెల రోజుల పాటు కారు నడపడం వల్ల ప్రజల జేబులపై పెను ప్రభావం పడుతోంది. అది ఓలా లేదా ఉబర్ లేదా మీ సొంత వాణిజ్య కారు అయినా సరే పెరిగిన ఇంధన ధరతో డ్రైవర్లు విసిగిపోయారు. ఈ పరిస్థితిలో మైలేజీ పెరిగే కొన్ని చిట్కాలు, ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.

1. ఏసీ వినియోగాన్ని తగ్గించండి

వేసవి కాలంలో కారు లోపల ఎయిర్ కండీషనర్ అవసరం. నిరంతరం కారులో ఏసీని ఆన్‌లో ఉంచుతాము. అయితే కారు క్యాబిన్ చల్లగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఏసీని ఆఫ్ చేయండి. ఇది కారులో చాలా ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

2. రెడ్ లైట్ వద్ద ఇంజిన్‌ను ఆఫ్ చేయండి

ట్రాఫిక్ లైట్ వద్ద లేదా మరేదైనా కారణాల వల్ల 10 సెకన్ల కంటే ఎక్కువ వేచి ఉండవలసి వస్తే మీరు వెంటనే వాహనం ఇంజిన్‌ను ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.

3. ఓవర్‌లోడింగ్‌ను నివారించండి

కారులో ఎక్కువ బరువు పెట్టడం అంటే ఇంజిన్‌పై ఎక్కువ లోడ్ పడుతుందని అర్థం. దీనివల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అదే సమయంలో వాహనం లోపల అనవసరమైన ఉపకరణాలను ఉంచకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది వాహనానికి మరింత బరువును పెంచుతుంది. ఇది ఇంధనాన్ని ఆదా చేసే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.

4. ఎయిర్ ఫిల్టర్‌ని మార్చండి

కారు ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే సరిగ్గా పని చేయకపోతే ఇంజన్‌పై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ సందర్భంలో మైలేజ్ పడిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు కారు ఫిల్టర్‌ను మారుస్తూ ఉంటే ఇంజిన్‌కు సరైన గాలి ప్రవాహం ఉంటుంది. ఇంజిన్ ఎటువంటి సమస్య లేకుండా పని చేస్తుంది అప్పుడు వాహనం మెరుగైన మైలేజీని అందిస్తుంది.

Tags:    

Similar News