Facts: వీటి జీవిత కాలం కేవలం కొన్ని రోజులు మాత్రమే.. ఆసక్తికర విషయాలు
అయితే ఈ విశ్వంలో జీవనం సాగిస్తున్నా కొన్ని జీవుల జీవిత కాలం కేవలం కొన్ని గంటలు మాత్రమే అంటే మీరు నమ్ముతారా.?
మనిషి సగటు జీవిత కాలం 70 నుంచి 72 ఏళ్లు. శాస్త్రసాంకేతిక రంగంతోపాటు, వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా మనిషి జీవిత కాలం క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ విశ్వంలో జీవనం సాగిస్తున్నా కొన్ని జీవుల జీవిత కాలం కేవలం కొన్ని గంటలు మాత్రమే అంటే మీరు నమ్ముతారా.? ఇంతకీ ఆ జీవులు ఏంటి.? వాటి జీవిత కాలం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
* మగ అనాఫిలిస్ జాతికి చెందిన దోమలు జీవిత కాలం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఈ దోమలు కాస్త పెద్దగా అవ్వగానే పునరుత్పత్తి కోసం భాగస్వాములను కనుగొంటాయి. పునరుత్పత్తి జరిగిన వెంటనే చనిపోతాయి. అయితే.. రక్తాన్ని పీల్చే ఆడ అనాఫిలిస్ దోమలు మగవారి కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి.
* మే-ఫ్లై దీనిని ఎఫెమెరోప్టెరా అని కూడా పిలుస్తారు. ఇది ఒక కీటకం. దీని జీవిత కాలం గరిష్టంగా కేవం ఒక రోజు మాత్రమే. ఈ సమయంలో ఇవి పునరుత్పత్తి చేసి చనిపోతాయి. మేఫ్లై తన జీవితంలో ఎక్కువ భాగం నీటిలో లార్వా దశలో జీవిస్తుంది.
* ఎంటోమారియా అనే కీటకం కేవలం 3 నుంచి 5 గంటలు మాత్రమే జీవిస్తుంది. అది కూడా కేవలం పునరుత్పత్తి కోసమే. పునరుత్పత్తి చేసిన వెంటనే చనిపోతాయి. ఇది కూడా ఎక్కువగా కాలం లార్వా రూపంలోనే ఉంటాయి.
* గాల్‌మిడ్జ్‌గా పిలుచుకునే కీటకం జీవిత కాలం కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఈ కీటకాలు మొక్కలపై నివాసం ఏర్పాటు చేసుకొని, పునరుత్పత్తి చేస్తాయి. పునరుత్పత్తి ప్రక్రియ ముగిసిన వెంటనే మరణిస్తాయి.
* సిల్క్ బాత్, బాంబిక్స్ మౌరి వంటి జాతులకు చెందిన జీవులు కేవలం 24 గంటలు మాత్రమే జీవిస్తాయి. వీటికి నోరు ఉండదు కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవు. జీవిత భాగస్వామిని కనుగోనడం, గుడ్లు పెట్టడం మాత్రమే వీటి పని.
* స్టెనోఫిసిడే అనే నీటి కీటకం జీవిత కాలం కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే. పుట్టిన తరువాత, ఈ కీటకాలు సహచరులను కనుగొని, పునరుత్పత్తి చేసి చనిపోతాయి. ఈ జీవుల జీవితంలో ఎక్కువ భాగం లార్వా రూపంలోనే ఉంటుంది.