Lunar Eclipse 2023: చంద్రగ్రహణం ముగిసిన వెంటనే ఇలా చేయండి.. లేదంటే నెగిటివ్ ఎనర్జీతో ఆగమాగం..!

Lunar Eclipse: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం సమయంలో, ప్రతికూల శక్తి వాతావరణంలో ఉంటుంది. కాబట్టి, గ్రహణం ముగిసిన వెంటనే కొన్ని పనులు చేయడం ద్వారా, లక్ష్మీ దేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది.

Update: 2023-10-28 12:00 GMT

Lunar Eclipse 2023: చంద్రగ్రహణం ముగిసిన వెంటనే ఇలా చేయండి.. లేదంటే నెగిటివ్ ఎనర్జీతో ఆగమాగం..!

Lunar Eclipse Remedies: ఈసారి 2023 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ రోజున సంభవిస్తుంది. శరద్ పూర్ణిమ పండుగను దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తుంటారు. కాగా, అక్టోబర్ 28 శనివారంన 30 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. భారతదేశంలో కనిపించే ఈ గ్రహణం పాక్షికంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో దీనిని చూడవచ్చు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. అంతే కాదు, ఈ కాలంలో దేవుడి విగ్రహాన్ని, పూజకు సంబంధించిన వస్తువులను తాకడం నిషేధం. సూత కాలం నుంచి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. గ్రహణం సమయంలో రాహువు ప్రభావం చాలా బలంగా ఉంటుం. ఇది అందరిపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, ప్రతికూల ప్రభావాలు చుట్టుపక్కల వస్తువులపై కూడా చూడొచ్చు.

గ్రహణం పట్టిన వెంటనే ఈ పని చేయండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 28న చంద్రగ్రహణం రాత్రి 11:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:24 గంటలకు ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గ్రహణ సమయంలో నిద్రలేవకపోతే మీరు తెల్లవారుజామున నిద్రలేచినట్లయితే వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మీరు నిద్రలేచిన వెంటనే, ముందుగా ఇంటి మొత్తం ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెబుతున్నారు. వీటిని అనుసరించడం ద్వారా, ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేయవచ్చు.

గ్రహణం తర్వాత ఇలా చేయండి..

- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం ముగిసిన వెంటనే, సూతకం కూడా ముగుస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లోని ప్రతి మూలలో గంగాజలాన్ని చల్లాలి. మీరు ఈ సమయంలో నిద్రపోతున్నట్లయితే, మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఇలా చేయాలి.

ముందుగా ఇంటి ప్రధాన ద్వారాన్ని గంగాజలం చల్లి శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అలాగే, ప్రతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మి ఉండదు అని చెబుతుంటారు.

- దీనితో పాటు ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి. గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, గ్రహణం ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

- గ్రహణం తర్వాత స్నానం చేయండి. మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై చల్లుకోండి. స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లడం మంచిది.

- గ్రహణం తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత గంగాజలం చల్లాలి. ఆ తరువాత ఆహార పదార్థాలపై గంగాజలం చల్లి వాటిని శుద్ధి చేయండి. గ్రహణం ప్రభావాలు అన్ని రకాల గ్రహణాలకు వర్తిస్తాయి. అంటే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో ఇలా చేయాలని చెబుతున్నారు.

(గమని: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా పాటించే ముందు నిపుణుల సూచనలు పాటించడం మంచిది.)

Tags:    

Similar News