See Monkey in Dream: కలలో కోతి కనిపించిందా.. ఇక వీటికి సిద్దంగా ఉండండి..!
See Monkey in Dream: ప్రతిరోజు మనం నిద్రపోయిన తర్వాత ఎన్నో కలలు కంటుంటాం.
See Monkey in Dream: ప్రతిరోజు మనం నిద్రపోయిన తర్వాత ఎన్నో కలలు కంటుంటాం. అందులో పక్షులు, జంతువులు, సముద్రాలు, మనుషులు ఇలా ఎన్నోరకాల వాటిని చూస్తుం టాం. కొన్ని కలలో అర్ధరాత్రి వస్తే మరికొన్ని తెల్లవారుజామున వస్తుంటాయి. ఏ కల అయినప్ప టికీ అది భవిష్యత్‌లో మనకు ఏదో ఒక సంకేతాన్ని సూచిస్తుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకి నిర్ధిష్టమైన అర్థం దాగుంటుంది. ఈ రోజు కలలో కోతి కనిపిస్తే శుభమా, అశుభమా తెలుసుకుందాం.
కలలో కోతులు పోట్లాడుకోవడం
కలలో కోతులు పోట్లాడుకోవడం చూస్తే భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని స్వప్న శాస్త్రం తెలియ జేస్తుంది. ఎందుకంటే అలాంటి కలలు వస్తే కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతోంది.
కలలో ఈత కొడుతున్న కోతిని చూడడం
కలలో కోతి ఈత కొడుతున్నట్లు కనిపిస్తే వచ్చే సమయం మీకు అనుకూలమని స్వప్న శాస్త్రం తెలియజేస్తోంది. అలాంటి కల వస్తే అదృష్టం వరిస్తుందని చెబుతారు. జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే కలలో కోతి కరిచినట్లయి తే భవిష్యత్‌లో ఏదైనా తీవ్రమైన గాయం జరగబోతోందని అర్థం.
కలలో తింటున్న కోతిని చూడడం
డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో తింటున్న కోతిని చూస్తే అశుభ సంకేతంగా పరిగణిస్తారు. కోపంతో ఉన్న కోతిని చూస్తే కూడా అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటి కలలు వస్తే ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
నవ్వుతున్న కోతి
కలలో కోతి నవ్వుతున్నట్లు కనిపిస్తే మంచి సమయం ఆసన్నమైందని అర్థం. కోతి సంతోషంగా ఉన్నట్లు కల వస్తే శుభపరిణామంగా చెబుతారు. ఇలాంటి కలలు వస్తే మీ జీవితంలో గౌరవం, ఆదాయం పెరుగుతుందని నమ్మకం.