Traffic Rules: డ్రైవింగ్‌లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. రూ. 15వేలు ఫైన్ పడే ఛాన్స్.. ఎందుకో తెలుసా?
Drunk And Drive Challan: భారతదేశంలో కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలులో ఉన్నాయి.
Drunk And Drive Challan: భారతదేశంలో కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలులో ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. లేదంటే భారీగా ఫైన్లు కట్టాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానా నుంచి జైలు వరకు చర్యలు తీసుకుంటారు. దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు కూడా అమలులో ఉన్నాయి. కానీ, ఇప్పటికీ చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదకరం. మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున దీనికి దూరంగా ఉండాలి.
మీరు మద్యం సేవించి డ్రైవ్ చేస్తే ప్రమాదంలో చిక్కుకున్నట్లే. తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఫైన్ వేస్తారు. మరోసారి దొరికితే జరిమానా పెరుగుతుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారిగా 10,000 జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, మీరు 15,000 రూపాయల చలాన్ లేదా 2 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవచ్చు. రెండూ శిక్షలు వేసే అవకాశం కూడా ఉంది.
ఇది కాకుండా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించే నిబంధన కూడా అమలులో ఉంది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటారు వాహనం నడుపుతూ పట్టుబడితే, అప్పుడు రూ. 5,000 చలాన్ విధిస్తారు. మరోవైపు, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 లేదా 3 నెలల జైలు లేదా రెండూ విధిస్తారు.
ఇవి కాకుండా సిగ్నల్ జంపింగ్ చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు, హెల్మెట్ లేకుండా బైక్ లేదా స్కూటర్ నడిపితే రూ.1,000 వరకు చలాన్ విధిస్తారు. సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపినందుకు రూ.1,000 చలాన్ కూడా విధిస్తారు.