Indian Railways: జనరల్ టిక్కెట్‌పై ప్రయాణిస్తున్న వారికి గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ లేకుండా జర్నీ.. అదేంటంటే?
Indian Railways General Ticket Rules: రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను ప్రారంభిస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరూ రైలులో టిక్కెట్లు, సీట్లు సులభంగా పొందవచ్చు. ఇక నుంచి జనరల్ టికెట్‌లో కూడా రైలులో సీటు పొందడానికి ఇకపై ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Indian Railways Enquiry: జనరల్ టిక్కెట్ నిబంధనల ప్రకారం ప్రయాణిస్తున్నారా.. అయితే, మీకో శుభవార్త ఉంది. జనరల్ టిక్కెట్‌పై ప్రయాణించే వారికి రైల్వే శాఖ పెద్ద ఊరటనిచ్చింది. ఎప్పటికప్పుడు, రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను ప్రారంభిస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరూ రైలులో టిక్కెట్లు, సీట్లు సులభంగా పొందవచ్చు. ఇక నుంచి జనరల్ టికెట్‌లో కూడా రైలులో సీటు పొందడానికి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భారతీయ రైల్వేలు అన్ని తరగతులకు అనేక ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాయని మీకు తెలుసా? ఇప్పుడు జనరల్ కేటగిరీలో ప్రయాణిస్తున్న వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జనరల్ టికెట్ కూడా బుకింగ్..
అన్‌రిజర్వ్‌డ్ జనరల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి రైల్వే ఇప్పుడు యాప్‌ను ప్రారంభించింది. అవును... ఇప్పుడు జనరల్ టిక్కెట్ల కోసం కూడా భారీ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. చాలా సార్లు టికెట్ కౌంటర్లు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు గంటల తరబడి లైన్లో నిలబడాల్సి రావడం, చాలాసార్లు టిక్కెట్ కూడా దొరకదు.
ప్రయాణికుల కష్టాలక్ చెక్..
ప్రయాణికుల ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ సరికొత్త యాప్ యూటీఎస్(UTS) విడుదల చేసింది. దీని ద్వారా మీ సమస్య పూర్తిగా తీరనుంది.
ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు?
ఈ యాప్‌ని మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు నమోదు చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ నంబర్, అన్ని ఇతర వివరాలను పూరించాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయడంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
టికెట్ బుకింగ్‌పై బోనస్..
ఈ యాప్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకుంటే, మీకు బోనస్ కూడా లభిస్తుంది. ఈ యాప్ ద్వారా తక్కువ ధరకే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆర్ వాలెట్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణ టికెట్ కీలక నియమాలు..
ఇది కాకుండా, సాధారణ టిక్కెట్ నిబంధనల గురించి మాట్లాడినతే, అది రెండు భాగాలుగా విభజించారు. దూరాన్ని బట్టి ఈ సమయం ఉండేది. ఎవరైనా రైలులో 199 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి వస్తే, టికెట్ కొనుగోలు చేసిన 180 నిమిషాలలోపు రైలు ఎక్కాలన్నది టిక్కెట్ నియమం. మరోవైపు ఎవరైనా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయాలనుకుంటే 3 రోజుల ముందుగానే జనరల్ టికెట్ కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది.