Indian Railways: దేశంలో నడిచే స్పెషల్ ట్రైన్.. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?
Indian Railways: భారతదేశంలో ఓ స్పెషల్ రైలు నడుస్తోంది. దీనిలో ప్రయాణించేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ స్పెషల్ ట్రైన్ ఎక్కడ నడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Indian Railways: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రజలు ప్రయాణించాలంటే టిక్కెట్లు కచ్చితంగా తీసుకోవాలి. టికెట్ లేకుండా రైల్వేలో ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సిందే. జనరల్, స్లీపర్, ఏసీ అనే మూడు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ రోజు ఓ స్పెషల్ రైలు గురించి తెలుసుకుందాం.. ఈ ప్రయాణానికి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఈ ట్రైన్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రతిరోజూ కొత్త రికార్డులను సాధిస్తోంది. ఇది ఆధునిక సాంకేతికతతో మరింత అనుసంధానించబడుతోంది. ఇటీవల, దేశవ్యాప్తంగా 508 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు ఆవిష్కరించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో వందే భారత్ రైలును నడుపుతున్నారు. భారతీయ రైల్వేలకు సంబంధించి అనేక చారిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ఇక్కడి అనేక రైళ్లు వాటి ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందాయి. అటువంటిదే భాగ్రా-నంగల్ రైలు.
ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు..
భారతీయ రైల్వేలోని భాగ్దా-నంగల్ రైలులో ప్రయాణించడానికి, ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రైలులో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ రైలు భాగ్రా-నంగల్ డ్యామ్ మీద నడుస్తుంది. ఈ రైలు ఆనకట్టను చూడటానికి, ప్రయాణీకులను ఇటు వైపు నుంచి మరొక వైపునకు తీసుకెళ్లడానికి నడిపిస్తున్నారు. ఈ రైలులో వచ్చి వెళ్లేందుకు ఎలాంటి టిక్కెట్టు తీసుకోనవసరం లేదు.
సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు..
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దులో నిర్మించిన భగ్దా-నంగల్ డ్యామ్‌ను చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు ఈ రైలును ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు ఉపయోగిస్తారు. ఈ రైలు సట్లెజ్ నది, శివాలిక్ కొండల గుండా వెళుతుంది. ఈ రైలు 13 కిలోమీటర్ల చిన్న ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ రైలు డీజిల్‌తో నడుస్తుంది. దీని కోచ్‌లు చెక్కతో తయారు చేశారు. నేటికీ 3 కోచ్‌లతో కూడిన ఈ రైలులో దాదాపు 800 మంది ప్రయాణిస్తున్నారు.