Vastu Tips for Broom: చీపురు విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందంట..!
Vastu Tips for Broom: హిందూ మతంలో చీపురు లక్ష్మీ దేవి రూపంగా పరిగణిస్తుంటారు. చీపురు ప్రత్యేక నియమాలను పాటిస్తే, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతుంటారు.
వాస్తు ప్రకారం, చీపురు ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచాల్సి ఉంటుంది. చీపురు ఉంచడానికి సరైన దిశ అంటే ఈశాన్య దిశలో ఉంటాలన్నమాట. లేదంటే డబ్బు నష్టం పెరుగుతుంది. ఇంటిలో చీపురును ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో చాలా కష్టాలు వెంటాడుతంటాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి.
చీపురు ఎప్పుడూ అలాంటి చోటే ఉంచాలని, ఎవరూ చూడని చోటే ఉంచాలని చెబుతుంటారు. చీపురును ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉంచితే వాస్తు దోషాలు వస్తాయి.
చీపురుపై ఎప్పుడూ అడుగు పెట్టకూడదు. చీపురుపై అడుగు పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్లేనని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషం సమస్య రావచ్చు.
చీపురు ఎప్పుడూ పడకగదిలో లేదా మంచం కింద, వంటగదిలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతాయి.
(గమనిక: ఇక్కడ అందిచిన సమాచారం సాధారణ నమ్మకాలు, సోషల్ మీడియాలో లభించిన విషయాలను జోడించి అందించాం. HMTV వీటిని ధృవీకరించడంలేదు. ఏదైనా విషయాలను ఫాలో చేయాలంటే మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)