Vastu tips: మెయిన్ డోర్ వద్ద ఈ 4 వస్తువులను ఉంచుతున్నారా.. వెంటనే తీసేయండి.. లేదంటే ఆర్థికంగా నష్టపోతారంతే..!
Home Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ 4 వస్తువులు చెల్లాచెదురుగా ఉంచడం వల్ల, లక్ష్మి దేవీ మీ ఇంట్లోకి ప్రవేశించదు. జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుంది.
Vastu Tips for Doors: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తును ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూ, కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తప్పు దిశలో నిర్మించిన ఇల్లు విపత్తులకు నిలయంగా మారుతుంది. ఇది కాకుండా, ఇంటి ప్రధాన ద్వారం కుటుంబం అదృష్టంపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రధాన గేటుకు సంబంధించిన అనేక చర్యలు ఇక్కడ తెలుసుకుందాం. దీని వలన మీరు లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందుతారు. దీంతో పాటు పగలు రాత్రి డబ్బుల వర్షం కురుస్తుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ 4 వస్తువులు చెల్లాచెదురుగా ఉంటే, లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన ద్వారం నుంచి ఈ 4 వస్తువులను వెంటనే తొలగించాలి..
1. చీపురు- ఇంటిని శుభ్రం చేయడం రోజువారీ పని. పరిశుభ్రత ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. దీనివల్ల కుటుంబంలో వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గుతుంది. అయితే చాలాసార్లు శుభ్రపరిచిన తర్వాత ప్రజలు చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఉంచుతారు. జ్యోతిష్యం ప్రకారం ఈ పని చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీపురు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదని చెబుతుంటారు.
2. చెత్త- ఇంటి బయట చెత్త ఉంచడం కొత్త విషయం కాదు. ఇంటి బయట ఉంచిన చెత్త వల్ల ఇంట్లో చీకటి మాత్రమే వస్తుందని మీకు తెలుసా. ఎప్పుడూ ఇంటి బయట చెత్తను ఉంచకుండా చూడాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత పోయి, ఇల్లు శ్మశాన వాటికలా కనిపిస్తుంది.
3. షూ-చెప్పులు- మనం ఇంటి బయట నుంచి లోపలికి వచ్చినప్పుడల్లా, మన షూ తీసి ఇంటి బయట ఉంచుతాం. కొన్నిసార్లు అది చెల్లాచెదురుగా ఉంటుంది. చెల్లాచెదురుగా ఉన్న బూట్లు, చెప్పులు మీ జీవితాన్ని చెల్లాచెదురుగా చేస్తాయని. గుర్తుంచుకోండి. మీరు మీ బూట్లు, చెప్పులు తీయాలనుకుంటే, వాటిని ఎప్పుడూ చెల్లాచెదురుగా ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా వెనకంజలో ఉండిపోతారు.
4. మనీ ప్లాంట్- జ్యోతిష్యులు మనీ ప్లాంట్‌ను డబ్బు, శ్రేయస్సుతో పోల్చుతుంటారు. ఈ మొక్కను పెంచిన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదన్నారు. కానీ పొరపాటున కూడా, ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాటకూడదు. లేకపోతే అదృష్ట నక్షత్రం క్షణాల్లో ఆగిపోతుంది.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంది. వీటిని నమ్మాలని హెచ్‌ఎంటీవీ చెప్పడం లేదు.)