Married Life Problems: వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ఇంట్లో ఈ పొరపాట్లు చేయవద్దు..!

Married Life Problems: పెళ్లి తర్వాత కొన్ని రోజులకు దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

Update: 2024-04-04 01:30 GMT

Married Life Problems: వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ఇంట్లో ఈ పొరపాట్లు చేయవద్దు..!

Married Life Problems: పెళ్లి తర్వాత కొన్ని రోజులకు దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఇద్దరి మధ్య గొడవలు కుటుంబ పురోగతిని దెబ్బతీస్తుంటాయి. ఉమ్మడి కుటుంబంలో జీవించేవారైతే పిల్లలపై నెగిటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటికి కారణం అన్వేషించాలి. జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో ఏమైనా పొరపాట్లు చేస్తున్నామో చెక్‌ చేసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

నిజానికి ఇంట్లో ఎలాంటి వ్యర్థ పదార్థాలు, ఇనుము, కలప మొదలైన వాటిని ఇంటి పైకప్పు లేదా టెర్రస్‌పై ఉంచకూడదు. పనికిరాని వస్తువులను టెర్రస్‌పై ఉంచడం వల్ల పడుకునే సమయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తుతాయి. బెడ్ షీట్లు, దిండు కవర్లు శుభ్రంగా, నీట్ గా ఉండాలి. బెడ్ షీట్ లేదా దిండు కవర్ చిరిగితే వెంటనే తీసేయండి. లేదంటే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి రోజురోజుకు రిలేషన్ షిప్ లో దూరం పెరుగుతుంది.

ఇంట్లో ప్రతి వస్తువును క్రమబద్ధంగా ఉంచాలి. ప్రతిదానిని నిర్ణీత స్థలంలో పెట్టాలి. వస్తువులను విచ్చలవిడిగా విసిరేయవలసిన అవసరం లేదు. పడకగదిలో ఎప్పుడూ పెద్దల, దేవుడి చిత్రాలను, విగ్రహాలను ఉంచవద్దు.హింసాత్మక ఫొటోలు ఉంచకూడదు. ప్రేమను ప్రదర్శించే ఫోటోలు ఉండాలి. తద్వారా పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా నీలం, నలుపు లేదా మరే ఇతర ముదురు రంగులు వేయకూడదు. కళ్లకు చల్లదనాన్ని అందించే రంగులు ఉండాలి. కనీసం వారానికి ఒకసారైనా ఆవుల షెడ్డుకు వెళ్లి అక్కడ ఉన్న గోవులకు సేవ చేయాలి. ఆవుల షెడ్డుకు డబ్బులు ఇచ్చే బదులు పచ్చి మేత, దాన తీసుకుని మీ చేతులతో ఆవులకు ఆహారం తినిపించాలి.

Tags:    

Similar News