Smartphone Buying Tips: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..!

Smartphone Buying Tips: కొంతమంది తరచుగా స్మార్ట్‌ఫోన్లు మారుస్తూ ఉంటారు. మార్కెట్‌లోకి ఏది కొత్తగా వస్తే దానిని కొనుగోలు చేయడం లేదంటే ఎక్సేంజ్‌ ఆఫర్‌ ఉపయోగించి మార్చడం చేస్తుంటారు.

Update: 2024-03-30 15:00 GMT

Smartphone Buying Tips: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..!

Smartphone Buying Tips: కొంతమంది తరచుగా స్మార్ట్‌ఫోన్లు మారుస్తూ ఉంటారు. మార్కెట్‌లోకి ఏది కొత్తగా వస్తే దానిని కొనుగోలు చేయడం లేదంటే ఎక్సేంజ్‌ ఆఫర్‌ ఉపయోగించి మార్చడం చేస్తుంటారు. టెక్నాలజీ విషయంలో అప్‌డేట్‌ అవడం మంచి విషయమే కానీ తరచుగా కొత్త ఫోన్‌ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే కొన్ని రోజుల్లోనే ఫోన్‌లో సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలను నివారించడానికి స్మార్ట్‌ఫోన్‌ను కొనేముందు ఈ చిట్కాలు పాటించండి. వాటి గురించి తెలుసుకుందాం.

బడ్జెట్: అన్నింటిలో మొదటిది మీరు ఎంత బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తారో నిర్ణయించుకోవాలి. ఫోన్ కొనడానికి ఎంత మొత్తం వెచ్చించాలో నిర్ణయించి దాని ప్రకారం ఫోన్‌ను కొనుగోలు చేయాలి.

స్క్రీన్ పరిమాణం, రిజల్యూషన్: మీ ఫోన్ స్క్రీన్ పరిమాణం, రిజల్యూషన్ చెక్‌ చేయాలి. మల్టీమీడియాను ఉపయోగించే వ్యక్తులకు పెద్ద స్క్రీన్ ఫోన్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న స్క్రీన్ ఫోన్‌లు యాక్సెసిబిలిటీ, పోర్టబిలిటీ కోసం ఉపయోగించే వ్యక్తులకు ఎక్కువగా ఉపయోగపడతాయి.

కెమెరా: చాలా మంది వ్యక్తులు తమ ఫోన్‌లతో ఫోటోలు తీస్తారు. కాబట్టి ఫోన్ కెమెరా కెపాసిటీ తెలుసుకోవాలి. ఫోన్ కెమెరా రిజల్యూషన్, సెన్సార్ పరిమాణం, ఆటోఫోకస్ సిస్టమ్‌ను చెక్‌ చేయాలి.

బ్యాటరీ లైఫ్: ఫోన్ బ్యాటరీ లైఫ్ ఒక ముఖ్యమైన అంశం. ప్రజలు ఫోన్ కొనడానికి వెళ్లినప్పుడు, అది ఫుల్ ఛార్జ్‌తో ఎంత సమయం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. mAh బ్యాటరీ అంటే బలమైన ఫోన్. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని గుర్తుంచుకోండి.

ఆపరేటింగ్ సిస్టమ్: ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇష్టపడతారో నిర్ణయించుకోవాలి. Android, iOS రెండూ వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఉంటాయి. వీటిని మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

Tags:    

Similar News