Viral Video: పాముతో డ్యాన్స్‌, ముద్దులు.. షాకింగ్ వీడియో..!

Viral Video: కూటి కోరకు కోటి విద్యలు అంటుంటారు. డబ్బులు సంపాదించేందుకు ఎన్నో రకాల మార్గాలను వెతుక్కుంటారు.

Update: 2024-11-15 09:55 GMT
A Women Dance and Kiss Snake Video Goes Viral in Social Media

Viral Video: పాముతో డ్యాన్స్‌, ముద్దులు.. షాకింగ్ వీడియో..!

  • whatsapp icon

Viral Video: కూటి కోరకు కోటి విద్యలు అంటుంటారు. డబ్బులు సంపాదించేందుకు ఎన్నో రకాల మార్గాలను వెతుక్కుంటారు. కొందరు ఏకంగా ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది నిజంగా నిజమని చెప్పక తప్పదు. ఓ మహిళ చేసిన సాహసం చూస్తే గుండె జల్లు మనకు మానదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

సాధారణంగా కింగ్ కోబ్రాను దూరం నుంచి చూస్తే తుర్రమని అక్కడి నుంచి పారిపోతుంటాం. అలాంటిది ఆ పాముతో డ్యాన్స్‌ చేస్తూ, పాముకు ముద్దులు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదూ. అయితే ఓ మహిళ మాత్రం పాముతో కలిసి డ్యాన్స్‌ చేసింది. స్టేజ్‌పైన ఓ మహిళ డ్యాన్స్‌ చేస్తోంది. అదే సమయంలో ఆమెకు ఎదురుగా ఓ నల్లటి త్రాచు పాము కదలాడుతోంది.

అయితే ఆ పాము ఎలా కదులుతుందో అలా కదులుతూ.. ఆ పామును ఒక రకంగా ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిందా యువతి. అనంతరం నెమ్మదిగా పాము దగ్గరకు వెళ్లి ఏకంగా ముద్దు పెట్టింది. అదే సమయంలో పాము కాటు వేసేందుకు పలుసార్లు ప్రయత్నించింది. అయితే పాము నుంచి తప్పించుకుంటూ డ్యాన్స్‌ చేసింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ కొందరు కామెంట్స్‌ చేయగా.. మరికొందరు మాత్రం ఇంతటి డేంజరస్‌ ఫీట్స్‌ చేయడం అవసరమా అంటూ స్పందిస్తున్నారు.


Tags:    

Similar News