ఈ బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. సినిమా టిక్కెట్ బుక్ చేసుకుంటే 50 శాతం తగ్గింపు..
Indian Bank: కరోనా కారణంగా చాలా రోజుల నుంచి సినిమాహాళ్లు మూతపడ్డాయి
Indian Bank: కరోనా కారణంగా చాలా రోజుల నుంచి సినిమాహాళ్లు మూతపడ్డాయి. దీంతో అందులో పనిచేసేవారికి ఉపాధి కరువైంది. వ్యాక్సిన్ వచ్చాక ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేసి ఇప్పుడిప్పుడే సినిమాహాళ్లకు పర్మిషన్ ఇస్తున్నాయి. ఈ సమయంలో కుంటుపడిన వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు సినిమా హాళ్లు, బ్యాంకులు, బుకింగ్ యాప్‌లు కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డుపై సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుంటే యాభై శాతం తగ్గింపునిచ్చింది.
అయితే ప్రభుత్వం సినిమాహాళ్లకు అనుమతి ఇచ్చిందని కానీ కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. దీంతో చాలారోజుల నుంచి వినోదానికి దూరమైన కుటుంబాలు ఇప్పుడు థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇండియన్ బ్యాంక ఆఫర్ ప్రకటించడం విశేషం. దేశంలోని 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన 'ఇండియన్ బ్యాంక్' తన కస్టమర్లకు సినిమా టిక్కెట్ల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు BookMyShow ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. అయితే ఇందుకోసం కొన్ని నిబంధనలు, షరతులు కూడా విధించింది.
ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి షరతులు..
1. మీరు ఇండియన్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ కలిగి ఉండాలి.
2. ఆఫర్‌ను పొందడానికి మీరు బుక్ మై షోని సందర్శించడం ద్వారా సినిమా టిక్కెట్‌లను బుక్ చేసుకోవాలి.
3. ఆఫర్ కింద మీరు ప్రతి నెల ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
4. టికెట్ బుకింగ్‌పై మీకు 50 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అయితే మీరు ఒకేసారి గరిష్టంగా రూ.250 తగ్గింపును పొందవచ్చు.
5. ఈ ఆఫర్ ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటుంది.