ZyCoV-D: దేశంలో అందుబాటులోకి మరో టీకా
ZyCoV-D: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు రెడీ ఉన్నట్టు తెలుస్తోంది.
ZyCoV-D: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు రెడీ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ -డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పింది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థకి సిఫార్సులు చేసింది. ఈ టీకాకు 66.6 శాతం సమర్ధత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. డీఎన్ఏ సాంకేతికతతో జైడస్ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా అయితే 12 ఏళ్ల పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అనుమతులు వచ్చాక ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.