ZyCoV-D: త్వరలో అందుబాటులోకి రానున్న నాలుగో వ్యాక్సిన్
ZyCoV-D: దేశీయంగా అభివృద్ధి చేసిన మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.
ZyCoV-D: దేశీయంగా అభివృద్ధి చేసిన మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీన్ని అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేయబోతోందట. ఈ నెలలోనే టీకాకు అనుమతులు లభిస్తాయని సంస్థ నమ్మకంగా ఉంది. అనుమతులు లభించిన వెంటనే టీకా ఉత్పత్తి ప్రారంభిస్తామని, నెలకు కోటి డోసులు తయారు చేస్తామని కంపెనీ ఎండీ శార్విల్ పటేల్ వెల్లడించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి మాదిరిగా ఇది రెండు డోసుల టీకా కాదు మూడు డోసుల టీకా. మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ ఎండీ తెలిపారు.