ZyCoV-D: ఇండియాలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్‌ వ్యాక్సిన్‌

ZyCoV-D: భారత్‌లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది.

Update: 2021-08-21 04:00 GMT

ZyCoV-D: ఇండియాలో 12 ఏళ పిల్లలకు కరోనా టీకా..

ZyCoV-D: భారత్‌లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఇక దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 58 కోట్ల మందికి పైగా కోవిడ్‌ టీకా తీసుకున్నారు.

దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. జైడస్‌ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్‌-డీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా సొంతంగా ఈ టీకాను అభివృద్ధి చేసింది. 12ఏళ్లు నిండినవారికి జైకోవ్‌-డీ టీకాను వేయవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ జైకోవ్‌-డీ అని తెలిపింది. ఏడాదికి 10 నుంచి 12 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది. ఈ టీకాను మూడు దశల్లో వేయనున్నారు.

ఇక 28 వేలకు పైగా మందిపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా కరోనా వైరస్‌పై 66.6శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ట్రయల్స్‌లో తేలింది. ఇక జైకోవ్‌-డీ టీకాను సూది లేకుండా ఫార్మాజెట్‌ అనే పరికరం సాయంతో వేస్తారు. ఇప్పటివరకు ఇండియాలో అనుమతి ఉన్న టీకాలు కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా కాగా వాటి తర్వాతి స్థానంలో జైకోవ్‌-డీ నిలిచింది. అయితే ఇప్పటివరకు ఇండియాలో అందుబాటులో ఉన్న టీకాలన్నీ కూడా 18ఏళ్లు పైబడినవారికే కాగా జైకోవ్‌-డీ మాత్రం 12ఏళ్లు నిండినవారికి కూడా వేయవచ్చు.

Tags:    

Similar News