Zika Virus: దేశ వ్యాప్తంగా మరోసారి జికా వైరస్‌ కేసుల కలకలం

*ఉత్తర ప్రదేశ్‌ ప్రజల్ని కలవరపెడుతున్న జికా వైరస్‌ *వైరస్‌ విజృంభిస్తే 46 కోట్ల మంది జికా బారిన పడే ఛాన్స్‌

Update: 2021-11-23 04:28 GMT

దేశ వ్యాప్తంగా మరోసారి జికా వైరస్‌ కేసుల కలకలం(ఫైల్ ఫోటో)

Zika Virus: మరోసారి జికా వైరస్‌ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. కాగా భారత్‌లో తొలిసారిగా 2017లో గుజరాత్‌, తమిళనాడు తరువాతి ఏడాది రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో జికా కేసులు బయటపడ్డాయి. అయితే రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న వైరస్‌ గత జులైలో కేరళ, మహారాష్ట్రల్లో వెలుగుచూసింది. ఉన్నట్టుండి ఉత్తర ప్రదేశ్‌లో పెరిగిన కేసులు దేశాన్ని కలవరపాటుకు గురిచేశాయి.

దోమలద్వారానే కాకుండా తల్లినుంచి గర్భంలో ఉన్న శిశువుకు జికా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సంక్రమించిన తర్వాత 3 నుంచి 14 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. జికా వైరస్‌ విజృంభిస్తే భారత్‌లో దాదాపు 46 కోట్ల మంది దాని బారిన పడే ప్రమాదం ఉందని అంచనా.

అంటువ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి గురించి ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఏడాది పొడవునా జికా వైరస్‌ సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఈ వైరస్‌ను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం తప్పనిసరి. ముఖ్యంగా గర్భిణుల సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ‌్యంగా దోమల నియంత్రణలో ఆధునిక పద్ధతుల పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో వాటి సంతతి వృద్ధి చెందుతోంది.

దేశంలో డెంగీ కేసులు స్వల్ప సంఖ‌్యలో నమోదవుతున్నా చికున్‌గున్యా ఉద్ధృతమవుతోంది. ఇక డెంగీ, చికున్‌గున్యా తగ్గాలంటే వ్యర్ధాల నిర్వహణ, మురుగు నీటి పారుదల సక్రమంగా సాగేలా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక ఇప్పటికే డెంగీ, చికున్‌గన్యా కేసులతో సతమతమవుతున్న దేశానికి, జికా వైరస్‌ ఉధ్ధృతి సైతం తోడైతే తీవ్ర పరిణామాలు తప్పవని కొందరి అభిప్రాయం.

Tags:    

Similar News