Yusuf Memon dead: జైలులో ముంబై పేలుళ్ల దోషి మృతి
Yusuf Memon dead:అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమన్ సోదరుడు యూసుఫ్ మెమన్ శుక్రవారం నాసిక్ సెంట్రల్ జైలులో మరణించాడు. అతని మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అతను హార్ట్ అటాక్ తో మరణించాడని ప్రచారం జరుగుతోంది.
Yusuf Memon dead: అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమన్ సోదరుడు యూసుఫ్ మెమన్ శుక్రవారం నాసిక్ సెంట్రల్ జైలులో మరణించాడు. అతని మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అతను హార్ట్ అటాక్ తో మరణించాడని ప్రచారం జరుగుతోంది. 1993 ముంబై బాంబు పేలుడు కేసులో యూసుఫ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. టైగర్ మెమన్ సోదరులు యూసుఫ్ మెమన్ , ఇసా మెమన్ 1993 వరుస బాంబు పేలుడు కుట్ర చేయడానికి తమ ఫ్లాట్లను ఇచ్చారు.
ఇసా ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్నాడు.. అతను అనారోగ్యంతో ఉండటం కారణంగా 13 సంవత్సరాల శిక్ష అనంతరం 2008 లో బెయిల్‌పై విడుదలయ్యాడు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 250 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో దోషిగా ఉన్న టైగర్ మెమన్ మరో సోదరుడు యాకుబ్ ను 2015లో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు.