School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..డిసెంబర్ సెలవుల జాబితా ఇదే

Update: 2024-11-28 02:34 GMT

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..!

School Holidays: నవంబర్ నెల ముగుస్తుంది. వచ్చేది డిసెంబర్ నెల. నవంబర్ నెలలో పాఠశాలలకు భారీగానే సెలవులు వచ్చాయి. మరి డిసెంబర్ నెలలో ఎన్ని సెలవులు ఉండబోతున్నాయి. డిసెంబర్ నెల సెలవుల జాబితా వచ్చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నవంబర్ నెల ముగిసిన డిసెంబర్ నెల రాబోతోంది. నవంబర్ నెలలో పాఠశాలలకు, కాలేజీలకు సెలువులు ఎక్కువగానే వచ్చాయి. గోవర్ధన్ పూజ, బైఫాంటా, ఛత్ పూజ, కార్తీక పూర్ణిమ వంటి పండగలు రావడంతో విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9గంటల వరకు కూడా మంచు కురుస్తుంది. సాయంత్రం 6గంటల తర్వాత చలి గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని స్కూళ్ల కు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో తుఫాన్ ప్రభావం వల్ల కూడా కొన్ని జిల్లాల్లో సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ సందర్భంగా సెలవులు ఉంటాయి. కొన్నిచోట్ల ఈ సెలవులు రెండు రోజులు ఉంటాయి. అదనంగా ఆదివారాలు 1,8,15,22,29 రోజుల్లో కూడా విద్యార్థులకు సెలవులు ఉంటాయి. చలికాలం సెలవులపై సమాచారం చలి తీవ్ర పెరుగుతోన్న నేపథ్యంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో డిసెంబర్ చివరి నుంచి శీతాకాల సెలవులు మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి చలికాలం సెలవులు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News