మీకు తెలుసా.. ఈ మందులు కొనుగోలు చేయడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు..!
Doctors Prescription: చాలా మంది ప్రజలు జ్వరం, శరీర నొప్పి మొదలైనవాటిని తగ్గించుకోవడానికి పారాసెటమాల్ తీసుకుంటారు.
Doctors Prescription: చాలా మంది ప్రజలు జ్వరం, శరీర నొప్పి మొదలైనవాటిని తగ్గించుకోవడానికి పారాసెటమాల్ తీసుకుంటారు. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద సమస్య ఏంటంటే మీరు దానిని మెడికల్ స్టోర్ నుంచి పొందడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించవలసి ఉంటుంది. ఈ సంక్లిష్టత కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇప్పుడు పారాసెటమాల్, సాధారణ ఉపయోగంలో ఉన్న 15 ఇతర మందులను OTC జాబితాలో చేర్చబోతుంది. OTC అంటే ఓవర్ ది కౌంటర్. సరళంగా చెప్పాలంటే మీరు ఈ మందులను తీసుకోవడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించాల్సిన అవసరం లేదు.
గెజిట్ నోటిఫికేషన్
నివేదిక ప్రకారం ఈ 16 ఔషధాలను చట్టంలోని షెడ్యూల్ kలో చేర్చడానికి వీలుగా ఔషధ నియమాలు సవరించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పు తర్వాత ఇప్పుడు రిటైలర్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను విక్రయించగలరు. సాధారణంగా వాడే మందులను అందరికీ సులభంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
కొన్ని షరతులు
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందుల అమ్మకం కొన్ని షరతులతో మాత్రమే ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ మందులని ఐదు రోజులకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి వ్యాధి తీవ్రత తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పారాసెటమాల్, డైక్లోఫెనాక్, నాసల్ డీకోంగెస్టెంట్లు, యాంటీ-అలెర్జీ మందులు, చిగురువాపు చికిత్సకు ఉపయోగించే మౌత్ వాష్, క్లోరోహెక్సిడైన్, దగ్గు, యాంటీ బాక్టీరియల్ చికిత్సకు ఉపయోగించే డెక్స్ట్రోమెథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ లాజెంజెస్ తీసుకోవచ్చు. మొటిమల సమ్మేళనాలు, యాంటీ ఫంగల్ క్రీమ్‌లు, యాంటీ దగ్గులు, అనాల్జేసిక్ క్రీమ్ ఫార్ములేషన్‌లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు.