Yogi Adityanath: 'మాఫియాను మట్టిలో కలిపేస్తా'.. అఖిలేష్‌ను ఉద్దేశించి సీఎం యోగి ఘాటుగా వ్యాఖ్య
Yogi Adityanath: మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా చంపడంపై సభలో సీఎం యోగీ, SP చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల తూటాలు పేలాయి. అఖిలేష్ వైపు వేలు చూపుతూ 'మాఫియాను మట్టిలో కలిపేస్తాం' అని యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 'బాధితురాలి కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్, సమాజ్ వాదీ పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగం కాదా?' అని ప్రశ్నించారు. ఆ మాఫియా వెన్ను విరిచేందుకు మేం కృషి చేస్తున్నాం అని అన్నారు. అలాగే అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. 'స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా' అని ఉద్వేగంతో యోగి ఆదిత్యనాథ్ అన్నారు.