YES Bank Money Laundering Case: యస్ బ్యాంకు కుంభకోణం కేసులో రాణా కపూర్‌కు ఈడీ భారీ షాక్
YES Bank Money Laundering Case: 4,300 కోట్ల రూపాయల యస్ బ్యాంకు కుంభకోణంలో.. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు భారీ షాక్ తగిలింది.
YES Bank Money Laundering Case: 4,300 కోట్ల రూపాయల యస్ బ్యాంకు కుంభకోణంలో.. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు భారీ షాక్ తగిలింది. వీరి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. వీటి విలువ 2,203 కోట్లని గురువారం అధికారులు ప్రకటించారు. ఇందులో రాణా కపూర్ కు చెందిన విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయి. రానా కపూర్ మరియు అతని కుటుంబ ఆస్తులలో ముంబైలో నివాస భవనం అలాగే అక్కడున్న కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి.
అలాగే ఢిల్లీలోని 685 కోట్ల విలువైన అమృతా షెర్గిల్ మార్గ్‌లోని ఒక బంగ్లాను కూడా ఈడీ ఎటాచ్ చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ .50 కోట్లు కూడా ఈడీ ఎటాచ్ చేసింది. ఇక వీటితోపాటు న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్ లో రెండు కమర్షియల్ ప్రాపర్టీస్‌తోపాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
ఇక ఈ కేసులో మరో అటాచ్మెంట్ ఆర్డర్‌లో డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవన్ , ధీరజ్ వాధవన్ లకు చెందిన ఆస్తులు ఇలా ఉన్నాయి. న్యూయార్క్‌లో ఒక ఫ్లాట్ , లండన్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి, వీటి విలువ 1,411.9 కోట్ల రూపాయలు. ఇందులో వధావన్స్ ఇండియా ఆస్తులు కూడా జతచేయబడ్డాయి. వీటిలో ఖార్ (వెస్ట్) లోని 12 ఫ్లాట్లు, పూణే , ముల్షిలోని రెండు ల్యాండ్ ప్లాట్లు, ఐదు లగ్జరీ వాహనాలు , బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి.