CM Yediyurappal: కర్ణాటకలో హాట్ హాట్ గా మారిన రాజకీయం

CM Yediyurappal: కీలక మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయం * త్వరలో కన్నడ సీఎం మార్పు..?

Update: 2021-07-23 02:13 GMT
కర్ణాటక సీఎం యెడియూరప్ప (ఫైల్ ఇమేజ్)

CM Yediyurappa: కర్ణాటక రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. సీఎం యడియూరప్ప సీఎం పదవి నుంచి తప్పుకోనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. దానికి యడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసారు. అనంతరం తాను ఇప్పట్లో సీఎం పదవి నుంచి తప్పుకోనని ప్రకటించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని కూడా స్పష్టం చేశారు. కానీ, అంతలోనే పొలిటికల్ స్ట్రాటజికల్ మారాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పను బీజేపీ నాయకులు అంగీకరించేది లేదంటూ బహిరంగానే ప్రకటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయనను పదవీచ్యుతుడిగా చేయాలని ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ రెండు వర్గాలుగా ఏర్పడింది. అయితే.. ఇందులో యడియూరప్ప వ్యతిరేక వర్గం బలంగా ఉంది. అందుకే ఆయన అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు.

గత కొన్నిరోజులుగా కర్ణాటకలో బాహాటంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే పార్టీ దెబ్బతినకూడదని భావించిన అధిష్టానం యడ్డీని సాగనంపాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వర్గాలు కర్ణాటక నాయకులకు సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యడ్డీ స్థానంలో పార్టీలోని సీనియర్ నాయకుడిని అధిష్టానం ప్రకటించనుంది. మరి కన్నడ నూతన సీఎం ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది.

Tags:    

Similar News