Worldwide Corona Deaths: ప్రపంచ దేశాలను ఏడాదిన్నరగా పీడిస్తోన్న కరోనా
Worldwide Corona Deaths: *ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అరకోటి మంది బలి *అమెరికాలో అత్యధికంగా 7 లక్షల మంది మృతి
Worldwide Corona Deaths: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడుస్తోంది. ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. ఒక్క అమెరికాలోనే 7లక్షల మంది చనిపోగా, బ్రెజిల్‌లో 6లక్షలు, భారత్‌లో సుమారు 5 లక్షల మంది వరకు మృతి చెందారు. గత ఏడాదిలో 25లక్షల మంది మరణించగా, మిగిలిన 25లక్షల మంది ఈ ఏడాదిలో ఇప్పటివరకు చనిపోయినట్టు తెలుస్తోంది.
దాదాపు 187 దేశాల్లో అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ను గుర్తించారు. గడిచిన వారం రోజుల్లో ప్రపంచంలో 8 వేల మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో సగానికి పైగా కేవలం ఐదు దేశాల్లోనే నమోదయ్యాయి. అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్‌లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు అమెరికాలో సంభవించాయి. దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో దాదాపు 6 లక్షల మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇక భారత్‌లోనూ నాలుగున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్థానాల్లో రష్యా, మెక్సికో దేశాలు నిలిచాయి.