WHO: ధూమపానం చేసేవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
WHO: కరోనాతో 50శాతం మరణించే ఛాన్స్ ఉందన్న WHO
WHO: ధూమపానం చేసేవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకిచ్చింది. పొగతాగేవారు కరోనాతో మరణించే అవకాశాలు 50శాతం ఉన్నట్లు ప్రకటించింది. స్మోకింగ్‌ను వదిలేయాలని.. దీంతో కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని WHO చీఫ్ టెడ్రోస్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ''క్విట్ టొబాకో క్యాంపెయిన్'' కార్యక్రమంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందన్న టెడ్రోస్.. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాల చేతులు కలపాలని కోరారు.