Corona vaccination: కరోనా వ్యాక్సిన్ వారికి ఇవ్వొద్దు.. WHO కీలక ప్రకటన
జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కరోనా టీకాలు చేరుకున్నాయి. అధికారులు వాటిని ఫ్రీజర్లలో భద్రపరిచారు. తొలి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తారు. ఆ తర్వాతే సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పలు కీలక సూచనలు చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సూచనలు చేసింది. తీవ్రమైన తీవ్రమైన అలర్జీ ఉన్నవారు, గర్భిణిలు, పాలిచ్చే బాలింతలు, 16 ఏళ్ల లోపు పిల్లలుకు.. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు రెండు మూడు నెలల వరకు గర్భధారణకు దూరంగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వారికి హెచ్ఐవి గాని ఉన్నట్లయితే బాధితులకు ముందే చెప్పాలని స్ఫష్టం చేసింది. దేశంలో 18 సంవత్సరాలు దాటిన వారికే కరోనా టీకా ఇవ్వాలని..16 ఏళ్ల లోపు వారికి అసలు వ్యాక్సిన్ వేయవద్ద ప్రకటించింది. 16 సంవత్సరాల లోపు వారిలో వ్యాక్సిన్‌ను తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ముఖ్యమైన సూచనలు చేసింది. దేశంలో ఒక ఏడాది కంటే పైనే ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు డీసీజీఐ (DCGI) ఆమోద ముద్రవేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండూ సురక్షితమైనవేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వీటిలో ఏ టీకా వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉండదని.. ఈ రెండింటిలోనే ఏదో ఒక టీకా అందుతుందని స్ఫష్టం చేసింది.
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ, రష్యా వాక్సిన్ స్పుత్నిక్-వీ, జైడుస్ క్యాడిల్లా తయారుచేసిన జైకోవ్ డీ, జెనోవా సంస్థల వ్యాక్సిన్లు కూడా ట్రయల్స్ దశలో ఉన్నాయని వెల్లడించింది. వీటిలో జైకోవ్ డీ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక స్పుత్నిక్-వీ రెండో దశ, బయోలాజికల్-ఈ ఒకటో దశ ప్రయోగాలను పూర్తి చేసుకున్నాయి. జెనోవా సంస్థ RNA ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రయోగదశలో ఉన్న ఈ టీకాలు విజయవంతమైతే వాటి కూడా మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కొవిషీల్డ్ టీకాను 2020, నవంబర్ 1వ తేదీన సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసింది.
అయితే కరోనా టీకా తరయారీ కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్‌పైరీ డేటు)తో పాటు బ్యాచ్ నంబర్‌ను కచ్చితంగా ముద్రిస్తారు. అయితే కరోనా నివారణకు సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి 3.64 లక్షల డోసుల వ్యాక్సిన్ నిన్న చేరింది. ఈ టీకా కాలపరిమితి 2021, మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. మొత్తం 31 బాక్సుల్లో నిల్వ చేసిన 3.64 లక్షల డోసులు కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోర్‌లో నిల్వఉంచారు.