Work from Home Exemption Extended: ఐటి ఉద్యోగులకు శుభవార్త

Work from Home Exemption Extended: దేశవ్యాప్తంగా ఉన్న ఐటి అలాగే బీపీఓ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఇంటినుంచి పనిచేసుకునే వెసులుబాటును పొడిగించింది.

Update: 2020-07-22 13:18 GMT
Work from Home Exemption Extended

Work from Home Exemption Extended: దేశవ్యాప్తంగా ఉన్న ఐటి అలాగే బీపీఓ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఇంటినుంచి పనిచేసుకునే వెసులుబాటును పొడిగించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ను డిసెంబర్ 31 వరకూ అనుమతిస్తూ డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి డబ్ల్యుఎఫ్‌హెచ్ నిబంధనలలో సడలింపులు చేసి ప్రకటించింది, ఇకనుంచి జులై తరువాత నుంచి కూడా ఉద్యోగులు ఇంటినుంచి పనిచేసుకునే వెసులుబాటు ఉంటుందని.. కంపెనీలు కూడా ఇందుకు సహకరించాలని సూచించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసుకునే వెసులువాటు కల్పించాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి మూడు నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఈ గడువు జులై ఆఖరుతో ముగుస్తుంది. దాంతో ఒకవైపు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువు ముగుస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలయింది. దాంతో డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఈ విధానాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులకు ఊరట ఏర్పడింది. కాగా భారత్ లో గడిచిన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు చేయించి. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరిగింది. దేశంలో మొత్తం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Tags:    

Similar News