Women Reservation Bill: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ రగడ

Women Reservation Bill: తమ పార్టీ అన్ని వర్గాల మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది

Update: 2023-09-19 11:38 GMT

Women Reservation Bill: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ రగడ

Women Reservation Bill: కొత్త రాజ్యసభ భవనంలో నిర్వహించిన తొలి సమావేశంలోనే రగడ రేగింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. బలహీన వర్గాల మహిళలను రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఖర్గే ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకొని నిరసన తెలిపారు బీజేపీ ఎంపీలు. ఖర్గే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొత్త రాజ్యసభ భవనంలో ప్రసంగించిన ప్రధాని మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట్లాడారు. అనంతరం ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ.. బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజ్వేషన్లు చేర్చాలని కోరారు. ఈ క్రమంలో పొలిటికల్‌ పార్టీలు బలహీన వర్గాల మహిళలను రాజకీయాలకు వాడుకుంటున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు ఖర్గే. బలహీన వర్గాల మహిళల్లో అక్షరాస్యత తక్కువ అని అందుకే పార్టీలు వారిని రాజకీయాలకు వినియోగించుకుంటున్నారని కామెంట్ చేశారు. చదువుకున్న,.. పోరాడే తత్వం ఉన్న మహిళలకు ప్రయోజనాలు కల్పించడం లేదన్నారు.

ఖర్గే వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఖర్గే వ్యాఖ్యల్ని ఖండించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత తమ పార్టీకి దక్కుతుందన్నారు నిర్మలా. మహిళలకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News