Azim Premji: దాతృత్వం చాటుకుంటున్న బిగ్‌ షాట్స్‌.. రూ.9,713 కోట్ల విరాళం

* పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయూత * రూ.9,713 కోట్ల విరాళంతో ఫస్ట్‌ప్లేస్‌లో అజీమ్‌ ప్రేమ్‌జీ

Update: 2021-10-29 03:51 GMT

 అజీమ్‌ ప్రేమ్‌జీ(ఫైల్ ఫోటో)

Azim Premji: బిగ్‌ షాట్స్‌ అందరూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి అండగా నిలబడుతున్నారు. వారు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని విరాళాల రూపంలో అందిస్తున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలకు ఈ విరాళాలు అందజేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ దాతృత్వంలో అగ్రస్థానంలో నిలిచారు. 2020-21లో ఆయన ‎ఏకంగా 9వేల 713 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు 27 కోట్లను వితరణగా అందించారు.

ఇక హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ 12 వందల 63 కోట్ల విరాళంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ 577 కోట్లు విరాళంతో మూడో స్థానంలో ఉండగా కుమార మంగళం బిర్లా 377 కోట్లు అందించి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు నందన్‌ నీలేకని 183 కోట్లతో 5వ స్థానానికి చేరారు. అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ మాత్రం విరాళం అందించడంలో 130 కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు.

Tags:    

Similar News