Uddhav Thackeray: నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది..

Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాలపై మౌనం వీడారు ఉద్ధవ్‌ థాక్రే.

Update: 2022-06-22 13:43 GMT

Uddhav Thackeray: నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది..

Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాలపై మౌనం వీడారు ఉద్ధవ్‌ థాక్రే. తాను సీఎం కుర్చీ కోసం ఏనాడు పాకులాడలేదని, సీఎంగా తనను ఉండొద్దంటే ఇప్పుడే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే. శివ సైనికుల అభిప్రాయాలే తనకు ముఖ్యమన్న థాక్రే ఒక్క ఎమ్మెల్యే తనను వ్యతిరేకించినా రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించారు.

ఇక తన వైపు ఎంత మంది ఉన్నారో ఎంత మంది లేరనేది పక్కనపెడితే తనకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడదని ధీమా వ్యక్తం చేశారు థాక్రే. సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తించానని.. కరోనా సమయంలో తమ కృషికి మంచి గుర్తింపు లభించిందని చెప్పారు. మంత్రి ఏక్‌నాథ్‌ శిందేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని.. తమను బలవంతంగా లాక్కెళ్లారని వారంతా వాపోతున్నారని ఉద్ధవ్‌ చెప్పారు.

Tags:    

Similar News