Lok Sabha: పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన

Lok Sabha: రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Update: 2021-07-19 14:27 GMT

Lok Sabha: పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన

Lok Sabha: రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌, వంట నూనెల ధరల పెరుగుదలపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనలు ఉన్నాయా అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేమీ లేదన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే కౌన్సిల్ సిఫారసు అవసరమని తెలిపారు. ఇక, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో పెట్రోల్ ధరను 39సార్లు డీజిల్ ధరను 36సార్లు పెంచినట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

Tags:    

Similar News