Jharkhand: హీటెక్కిన జార్ఖండ్ రాజ‌కీయాలు.. సొరేన్‌ భార్యకు సీఎం పగ్గాలు?

Jharkhand: సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు

Update: 2024-01-31 07:45 GMT

Jharkhand: హీటెక్కిన జార్ఖండ్ రాజ‌కీయాలు.. సొరేన్‌ భార్యకు సీఎం పగ్గాలు?

Jharkhand: జార్ఖండ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. భూకుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. సీఎం హేమంత్‌ సొరేన్‌ను నేడు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతుంది. ఒకవేళ ఈడీ హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేస్తే.. ఆయన భార్య కల్పనా సొరేన్‌కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార జేఎంఎం ‘ప్లాన్‌-బీ’ని ఇప్పటికే సిద్ధం చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఢిల్లీ వెళ్లిన తర్వాత కొన్ని గంటల పాటు సీఎం హేమంత్‌ సొరేన్‌ అందుబాటులో లేని సీఎం హేమంత్‌ సొరేన్‌.. రాంచీలో దర్శనమిచ్చారు. హేమంత్‌ సొరేన్‌ అధికారిక నివాసంలో జేఎంఎం, సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కల్పనా సొరేన్‌ కూడా హాజరు కావడం.. రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించిన జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్టు సమాచారం.

Tags:    

Similar News