Madhya Pradesh Doctor Wife Corona Positive: భార్యకు క‌రోనా.. ప‌నిమ‌నిషి పేరిట న‌మూనాలు.. బుక్కయిన ప్రభుత్వ వైద్యుడు!

Madhya Pradesh Doctor Wife Corona Positive: భోపాల్ లోని ఓ ప్రభుత్వ వైద్యుడు తానూ చేసిన తప్పును కప్పు పుచ్చుకోవడానికి చేసిన నిర్వహం అతగాడిని కటకటాల్లోకి నెట్టేసింది

Update: 2020-07-12 08:16 GMT

Madhya Pradesh Doctor Wife Corona Positive: భోపాల్ లోని ఓ ప్రభుత్వ వైద్యుడు తానూ చేసిన తప్పును కప్పు పుచ్చుకోవడానికి చేసిన నిర్వహం అతగాడిని కటకటాల్లోకి నెట్టేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సింగ్రౌలి ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఓ వైద్యుడు.. అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లికి జూన్‌ 23న హాజరయ్యాడు. ఇక జులై 1న తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉండక తన విధులకి హాజరయ్యాడు.

ఆ తరవాత తన భార్యలో కరోనా లక్షణాలు కొన్ని కనిపించాయి. దీనితో ఆ వైద్యుడు తన ఇంట్లో పని చేసే పనిమనిషి పేరు మీద తన భార్య శాంపిళ్లను పంపించాడు. అయితే ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు పనిమనిషి ఇంటికి రావడంతో ఆ వైద్యుడి ఆసలు కధ బయటపడింది. దీనితో అధికారులు అతనిపైన ఫైర్ అయ్యారు. అంతేకాకుండా క్వారంటైన్‌ నిబంధనలను పక్కన పెట్టినందుకు గాను అతనిపై 'ఎపిడమిక్‌ చట్టం' కింద కేసు నమోదు చేశారు.

అతడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతడిపై పూర్తి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇక అతని ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరొనా అని తేలింది. దీనితో వారందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. ఇక జులై 1 తర్వాత ఆ వైద్యుడిని ను కలిసిన 33 మంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. వీరిలో ఒకరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు. త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28 వేల 637 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. 8,49,553 పాజిటివ్ కేసులలో 5,34,620 మంది కోలుకున్నారు. అలాగే కొత్తగా 551 మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకూ మొత్తం 22,674 మంది కరోనా భారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,92,258 గా ఉంది.  

Tags:    

Similar News