ఆ యుద్ధ విమానాలే ఎందుకు కూలుతున్నాయి?

Aircraft: అవి మొదటి తరం సూపర్‌ సోనిక్‌ యుద్ధ విమానాలు 1963లో అత్యాధునికమైనవే కానీ తయారుచేసిన దేశమే వాటిని మూలన పడేసింది.

Update: 2022-07-30 13:00 GMT

ఆ యుద్ధ విమానాలే ఎందుకు కూలుతున్నాయి?

Aircraft: అవి మొదటి తరం సూపర్‌ సోనిక్‌ యుద్ధ విమానాలు 1963లో అత్యాధునికమైనవే కానీ తయారుచేసిన దేశమే వాటిని మూలన పడేసింది. అప్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కూడా వాటిని తుక్కు కింద పడేశాయి. కానీ భారత్‌ మాత్రం ఇంకా వయస్సుమల్లిన ఆ ఫైటర్ జెట్లనే వాడుతోంది. 20 నెలల్లో అదే రకానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు కూలిపోయాయి. 1963లో కొనుగోలు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు 400 ఫైటర్‌ జెట్లు కూలిపోయాయి. దీంతో వాటికి ఎగిరే శవపేటికలన్న పేరు వచ్చింది. ఇంతకు ఆ ఫైటర్ జెట్లు ఏవనే కదా మీ ప్రశ్న?.. తాజాగా రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లా బీమ్రా సమీపంలో మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ కూలిపోయింది. అందులోని ఇద్దరు ఫైలట్లు ప్రాణాలను కోల్పోయారు. దీంతో మిగ్‌-21పై చర్చ మళ్లీ మొదలయ్యింది. వాటిని వదిలించుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

రెండ్రోజుల క్రితం రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బ్రిమా సమీపంలో మిగ్‌-21 విమానం కూలిపోయింది. అందులో ఉన్న పైలట్లు వింగ్‌ కమాండర్‌ రానా మండి, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ అద్వితీయ బాల్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మిగ్‌-21 సూపర్ సోనిక్‌ ఫైటర్‌ జెట్ల భద్రతా ప్రమాణాల విషయం మల్లీ తెరపైకి వచ్చింది. సుదీర్ఘ కాలం భారత వాయుసేనకు సేవలందించిన ఈ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎందరో ఫైలట్ల ప్రాణాలను బలిగొంటున్నాయి. దీంతో ఈ ఫైటర్‌ జెట్ల భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాలం చెల్లిన ఈ ఫైటర్‌ జెట్లను తొలగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మిగ్‌-21 యుద్ధ విమానాలను తయారుచేసే రష్యా వాటిని ఏనాడో మూలన పడేసింది. వాటిని అతి చిన్న దేశాలైన అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కూడా వాటిని పక్కన పెట్టేశాయి. అయినా భారత్‌ పాత యుద్ద విమానాలను ఇంకా వినియోగిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

1962లో చైనాతో యుద్ధం తరువాత వాయుసేన బలోపేతంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పట్లో అమెరికా, చైనా మిత్ర దేశాలుగా ఉన్నాయి. దీంతో అమెరికాకు బయపడి భారత్‌కు ఆయుధాలను విక్రయించేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు. అయితే అమెరికాకు శత్రువైన సోవియట్‌ రష్యా మాత్రం భారత్‌కు ఫైటర్ జెట్లను విక్రయించేందుకు సమ్మతించింది. రష్యాలోని ఓకేబీ ఏరోస్పేస్‌ కంపెనీ మికోయన్‌ గురేవిచ్‌ -MIG డిజైన్‌ యుద్ధ విమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1963లో మిగ్‌-21 యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలోకి చేరింది. అప్పటికి అదే తొలి సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌ జెట్‌ ఆ తరువాత మిగ్‌-21 విమాన తయారీ, విడి భాగాల సాంకేతికతను భారత్‌కు రష్యా అందజేసింది. 1967లో హిందూస్థాన్ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌-హెచ్‌ఏఎల్‌ మిగ్‌ విమానాల తయారీకి లైసెన్స్‌ పొందింది. అనంతరం ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తరువాత మొత్తం 12 వందల మిగ్‌-21 విమానాలను వాటి ఇతర వర్షన్లను వాయుసేన అమ్ముల పొదిలోకి చేరాయి. ప్రస్తుతం ట్రైనింగ్‌, మరమ్మతులతో కలిపి 120 మిగ్‌-21 ఫైటర్ జెట్లు అందుబాటులో ఉన్నాయి.

మిగ్‌ విమానాల తయారీని నిలిపేస్తున్నట్టు సోవిట్‌ యూనియన్‌ 1985లోనే ప్రకటించింది. అత్యాధునిక యుద్ధ విమానాల తయారీలో భాగంగానే అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు సోవియట్‌ యూనియన్‌ అప్పట్లో ప్రకటించింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ మిగ్‌ సేవలను నిలిపేశాయి. నిజానికి భారత్‌లో వినియోగిస్తున్న మిగ్‌-21 జీవితకాలం 1990ల నాటికే ముగిసిపోయింది. అయితే పక్కలో బల్లెంలా మారిన చైనా, పాకిస్థాన్‌ను ఎదుర్కొనడానికి వాయుసేనకు అత్యంత శక్తివంతమైన మల్టీపర్పస్‌ ఫైటర్‌ జెట్లు పెద్ద సంఖ్యలో కావాలి. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారత గగనతలాన్ని కాపాడుకునేందుకు రాఫెల్‌ స్థాయి మల్టీపర్పస్‌ యుద్ధ విమానాలు కనీసం 126 అవసరమవుతాయి. భారత్‌ వద్ద రాఫెల్ ఫైటర్‌ జెట్లు, మిగ్‌-21 అప్‌గ్రేడ్‌ వర్సన్‌ సుఖోయ్‌-30 విమానాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. తేజస్‌ ఫైటర్ జెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గత్యంతరం లేక మిగ్‌ విమానాలతోనే వాయుసేన సరిహద్దులో గస్తీ నిర్వహిస్తోంది.

సామర్థ్యానికి మించి మిగ్‌-21 ఫైటర్‌ జెట్లను వినియోగిస్తున్న కారణంగానే అవి కుప్పకూలుతున్నట్టు నిపుపణులు చెబుతున్నారు. 1963 నుంచి 2012 నాటికే 400 మేర ఫైటర్‌ జెట్లు కూలిపోయినట్టు అప్పటి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని పార్లమెంట్‌లో తెలిపారు. ప్రమాదాల్లో 200 మంది పైలట్లు, మరో 50 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. గత 20 నెలల్లో ఆరు మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు కూలిపోయాయి. దీంతో ఈ ఫైటర్‌ జెట్లను ఎగిరే శవపేటికలుగా, విడో మేకర్‌గా పిలుస్తారు. మిగ్‌-21 సేవలు ఇప్పటికీ అద్భుతంగా ఉన్నా వాటి భద్రత మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాటిని వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు చివరి నాటికి శ్రీనగర్‌లోని 51 ఎయిర్‌బేస్‌ స్కాడ్రన్‌ మిగ్‌-21 సేవలను నిలిపేయనున్నట్టు ప్రకటించింది. మిగిలిన మూడు స్కాడ్రన్లు ఏడాది చొప్పున ఒక్కొక్కటి పూర్తిగా 2025 నాటికి మిగ్‌-21 యుద్ధ విమానాలను పూర్తిగా నిలిపేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో స్వాడ్రన్‌లో 16 నుంచి 18 మిగ్‌ జెట్లు ఉన్నాయి.

మిగ్‌-21 సేవలను నిలిపేయాలని వాయుసేన నిర్ణయించింది. తేజస్ ఫైటర్ జెట్ల తయారీని భారత్‌ వేగవంతం చేసింది. 2025 నాటికి భారత వాయుసేన అమ్ముల పొదిలోకి వాటిని చేర్చేలా ప్రణాళికలను రూపొందించింది. మరోవైపు తేజస్‌ ఫైటర్ జెట్లను విదేశాలకు విక్రయించడంపైనా దృష్టి సారించింది.

Tags:    

Similar News