Madhulika Rawat: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి మజిలీలోనూ..
Madhulika Rawat: బిపిన్ రావత్ ఉన్నత స్థాయికి ఎదగడంలో ఆయన వెన్నంటి నడిచిన వ్యక్తి ఆయన భార్య మధులికా రావత్.
Madhulika Rawat: బిపిన్ రావత్ ఉన్నత స్థాయికి ఎదగడంలో ఆయన వెన్నంటి నడిచిన వ్యక్తి ఆయన భార్య మధులికా రావత్. వీరికి ఇద్దరు కుమార్తెలు మధులిక రావత్ ఆర్మీ ఉద్యోగుల భార్యల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆర్మీ మృతుల కుటుంబాల సంక్షేమం కోసం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన మధులిక ఆర్మీ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం తపన పడ్డారు.
ఎన్నో సేవా కార్యక్రమాలు, చైతన్య పరిచే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆర్మీ విడోస్, కేన్సర్ పేషెంట్స్,దివ్యాంగుల కోసం ఆమె సేవా కార్యక్రమాలు చేపట్టారు. మధులికా చివరి శ్వాస వరకు భర్త వెన్నంటే ఉండి.. ఆఖరి మజిలీలోనూ ఆయన తోడు పంచుకున్నారు. మధులిక మరణం ఆమె కుటుంబ సభ్యులు, ఏడబ్ల్యూడబ్ల్యూఏకు మాత్రమే కాదు.. ఇతరులకు సాయం చేయాలనుకునే గొప్ప గుణాన్ని ఆరాధించగల ప్రతి ఒక్కరికి తీరని లోటు.