Who is Bipin Rawat: బిపిన్ రావత్ ఎవరో తెలుసా..
Who is Bipin Rawat: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న బిపిన్ రావత్ భారత్‌కు తొలి సీడీఎస్‌గా ఉన్నారు.
Who is Bipin Rawat: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న బిపిన్ రావత్ భారత్‌కు తొలి సీడీఎస్‌గా ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావతే లద్ధాఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. మూడు దళాలు బీజింగ్‌ను సమిష్టిగా ఎదుర్కొనే వ్యూహంలో బిపిన్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి.
మరోవైపు భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు బిపిన్ రావత్ మార్గదర్శిగా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వం భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే బాధ్యత బిపిన్ రావత్‌దే. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కంటే ముందు బిపిన్ రావతే ఆర్మీ బాధ్యతలు చూసుకున్నారు.
ఇక ఉత్తరాఖండ్‌లోని పౌరీలోని రాజ్‌పుత్ కుటుంబంలో బిపిన్ రావత్ జన్మించారు. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.
ఇదేలా ఉంటే బిపిన్ రావత్ నిన్ననే ఓ వార్నింగ్ ఇచ్చారు. జీవాయుధ పోరాటానికి సన్నద్దంగా ఉండాలన్నారు. ప్యానెక్స్-21 ప్రారంభోత్స ఈవెంట్ లో పాల్గొన్న రావత్ ఓ కొత్త విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నానని, కొత్త తరహా యుద్ధానికి సన్నద్దం కావాలన్నారు. ఒకవేళ జీవాయుధ పోరాటాలు ప్రారంభం అవుతున్నట్లు గమనిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు బలోపేతం కావాలన్నారు. వైరస్ లు, వ్యాధులను తట్టుకునే రీతిలో మన దేశం ప్రిపేర్ కావాలని రావత్ తెలిపారు.