Corona vaccine: వ్యాక్సిన్లు కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తాయి..సౌమ్య స్వామినాథన్

Corona vaccine: కోవిడ్ వ్యాక్సిన్లు ఐసీయూలో చేరాల్సిన స్థితి నుంచి కచ్చితంగా రక్షిస్తాయని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు

Update: 2021-05-11 04:24 GMT

WHO chief scientist Soumya Swaminathan

Corona vaccine: భారత్‌లో ఉన్న డబుల్‌ మ్యూటెంట్‌లో బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వైరస్‌ రకాలు రెండూ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఉద్ఘాటించారు. దేశ ప్రజలంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే ఇప్పటి వరకు భారత్‌లో వెలుగులోకి వచ్చిన డబుల్‌ మ్యూటెంట్‌.. వ్యాక్సిన్ల సామర్థ్యం నుంచి తప్పించుకుంటోందనడానికి ఆధారాలు లేవని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తాయని.. ఐసీయూలో చేరాల్సిన స్థితి నుంచి కచ్చితంగా రక్షిస్తాయని వెల్లడించారు. ఏ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా.. దాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రెండో దశలో భాగంగా భారత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ రకానికి వేగంగా, అత్యధికంగా వ్యాపించే గుణం ఉందని సౌమ్య స్వామినాథన్ ఉద్ఘాటించారు. దేశ ప్రజలంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News