COVID19 Variants: కరోనా వేరియంట్లకు కొత్త పేర్లు పెట్టిన డబ్ల్యూహెచ్ఓ
New names for corona variants: కరోనా కొత్త వేరియంట్లను దేశాల పేర్లతో పిలవవద్దని చెప్పిన డబ్ల్యుహెచ్ఓ కొత్త పేర్లను పెట్టింది.
COVID19 Variants: చైనా వైరస్, యూకే వేరియెంట్, భారత్ వేరియెంట్ అంటూ ఇక నుంచి పిలవడానికి వీల్లేదు. ఏ దేశంలో మొదట ఏ వేరియెంట్ కనపడితే.. దానికి ఆ దేశం పేరు పెట్టి వ్యవహరించడం ఇప్డు నడుస్తోంది. వైరస్ కు ఇలా దేశాల పేర్లు పెట్టడం వలన కొత్త సమస్యలు వస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఇప్పటికే చైనా వైరస్ అని పిలవడం పట్ల ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, యూకే వేరియెంట్ అనడానికి బ్రిటన్, సింగపూర్ వేరియెంట్ అనడాన్ని సింగపూర్ వ్యతిరేకిస్తున్నాయి. వీటన్నిటికి తెర దించుతూ.. డబ్ల్యూహెచ్ లో వేరియెంట్లకు నామకరణం చేపట్టింది. ఇప్పటి నుంచి ఆపేర్లతోనే పిలవాలనే నిబంధనల కూడా పెట్టింది.
పూర్తి వివరాల్లోకి వెళితే...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎప్పుడూ ఇలా దేశాల పేర్లతో వేరియంట్లను పిలవలేదు. కానీ... స్థానిక మీడియా, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాల వల్ల ప్రజల్లోకి ఇలాంటి పేర్లు వెళ్లిపోయాయి. దాంతో... ఆయా దేశాలు... ప్రపంచ దేశాల ముందు నిందితుల్లా మారే పరిస్థితి వచ్చింది.
ఇండియన్ వేరియంట్ అనే తప్పుడు పదం ప్రచారంలోకి రావడంతో... చాలా దేశాలు ఇండియాతో రాకపోకలు ఆపేశాయి. కొన్ని దేశాలు ఇండియా వేరియంట్ వల్ల తమ దేశానికి ముప్పు ఉందని ఆరోపణలు చేశాయి. ఇదే సమస్యను బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ దేశాలు కూడా ఎదుర్కొన్నాయి.
ఇక గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... కరోనాను... చైనా వైరస్ అని పిలవడంపై... గతేడాది పెద్ద దుమారమే రేగింది. దానిపై చైనా అభ్యంతరం తెలిపింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని... WHO... ఈ కొత్త వేరియంట్లకు ప్రత్యేక పేర్లు... అందరూ పలికేలా ఉండే పేర్లు పెట్టింది. ఇందుకోసం గ్రీక్ ఆల్ఫాబెట్‌ను వాడేసింది. అంటే ఆల్ఫా, బీటా, గామా లాంటివి.
ప్రస్తుతం కరోనా వేరియంట్లలో రెండు రకాలు ఉన్నాయి. 1.వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (VOCs). 2.వేరియంట్స్ ఆఫ్ ఇంట్రస్ట్ (VOIs). ఒకటో రకం వేరియంట్లు... ఇతర దేశాలకూ వ్యాపించిన రకం. రెండోరకం వేరియంట్లు... ఏ దేశంలో పుడితే... ఆ దేశానికే పరిమితం అయ్యాయి. వేరియంట్లకు పేర్లు పెట్టేటప్పుడు కూడా ఈ విభజనను అలాగే ఉంచింది WHO.
ఇండియాలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ కి డెల్టా(Delta) అనే పేరు పెట్టింది. దీన్ని 2020 అక్టోబర్ లో ఇండియాలో కనుగొన్నట్లు తెలిపింది. ఇండియాలో కనిపించిన మరో వేరియంట్ ఉంది. దానికి కప్ప(kappa) అనే పేరు పెట్టింది.