West Bengal Election Results 2021: నందిగ్రామ్‌లో మమతాబెనర్జీ గెలుపు

West Bengal Election Results 2021: మమతాబెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఉత్కంఠగా మారిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ గెలుపొందారు.

Update: 2021-05-02 11:32 GMT


West Bengal Election Results 2021: నందిగ్రామ్‌లో మమతాబెనర్జీ గెలుపు

West Bengal Election Results 2021: మమతాబెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఉత్కంఠగా మారిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ గెలుపొందారు. ఆమె పశ్చిమబెంగాల్ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన దీదీ హ్యాట్రీక్ సాధించారు. దీంతో మరోసారి బెంగాల్‌ గడ్డపై తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. నందిగ్రామ్ ఫలితాలు రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠను రేపాయి. చివరకు మమతనే విజయం వరించింది. టీ 20 మ్యాచ్‌ని తలపించింది. ఎప్పటికప్పుడు ఆధిక్యాలు మారాయి. దాంతో చివరకు విజయం మమతనే వరించింది. నంద్రిగ్రామ్‌లో పట్టున్న సువేందు అధికారి మమతకు గట్టిపోటీ ఇచ్చారు. దాంతో ఛాలెంజ్‌ చేసి మరి దీదీ విజయం సాధించారు. 12వందలకు పైగా ఓట్లతో మమతా గెలుపొందారు.

సువెందు వర్సెస్ మమతాబెనర్జీ గా సాగిన నందిగ్రామ్ ఫలితాలకు ఫుల్ స్టాప్ పడింది. మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఎలా ఉన్నా.. అందరి దృష్టి మాత్రం నందిగ్రామే పైనే ఉన్నాయి. మొదటి రౌండ్ నుంచి ఆరు రౌండ్ల వరకు సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగారు. ఆ తర్వాత పుంజుకుని దీదీ లీడ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ సువేందుకు అధిక ఓట్లు వచ్చాయి. ఇలా రౌండ్ రౌండ్‌కు ఎవరూ ఆధిక్యంలోకి వస్తారనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. చివరి 15వ రౌండ్‌లోనూ 8 ఓట్ల మెజార్టీతో సువేందు ఉన్నారు. ఆ తర్వాత 16వ రౌండ్‌లో 820 ఓట్ల మెజార్టీలోకి మళ్లీ మమతాబెనర్జీ లీడ్‌లోకి వచ్చారు. 17 రౌండ్ పూర్తయ్యే సరికి 12వందలకుపైగా మెజార్టీతో దీదీ విజయం సాధించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన నందిగ్రామ్ ఎన్నికల ఫలితాల్లో మమతా విజయం సాధించడంతో బెంగాల్ గడ్డపై మూడో సారి దీదీ సీఎం పీఠం ఎక్కనున్నారు. బీజేపీని పశ్చిమబెంగా‌ల్‌లో అడుగు పెట్టనివ్వమని చెప్పి మరీ రంగంలోకి దిగిన దీదీ ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టనున్నారు. ఇంతకుముందు భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ, ఈసారి తన అనుచరుడు సువేందు అధికారి తన నుంచి విడిపోవడంతో ఆయనపైనే పోటీ చేసి విజయం సాధించారు.

నందిగ్రామ్‌లో గెలిచి తీరుతానని సువేందుతో సవాల్ చేసి మరీ గెలిచారు. నందిగ్రామ్‌లో 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఛాలెంజ్‌ చేసిన సువేందు ఓడిపోయారు. మమతా ఈ ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాలికి గాయమైనా దాన్ని సైతం సెంటిమెంట్ ఆస్త్రంగా మలిచి ఓట్లను రాబట్టుకున్నారు. బెంగా‌ల్‌లో ఎలాగైనా పాగా వేయాలన్న కమలనాథుల కలలను భగ్నం చేయడంలో దీదీ విజయం సాధించారు.

Tags:    

Similar News