West Bengal Election Results 2021: ఆరు రౌండ్ల తర్వాత మమతకు ఆధిక్యం
West Bengal Election Results 2021: దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
West Bengal Election Results 2021: దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌పైనే అందరి దృష్టి ఉంది. దేశ రాజకీయాల్లో తమకు ఎదురు లేదని చాటాలనుకుంటున్న బీజేపీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంట్లో నలుసుగా మారడం, ఆమెను ఓడించేందుకు కాషాయ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేశారు. ఉత్కంఠ రేపుతున్న నందిగ్రాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆరు రౌండ్ల తర్వాత ఆమెకు 1427 ఓట్ల ఆధిక్యం లభించింది. మొదటి రౌండ్ నుంచి మమతా వెనుకంజలో ఉండటంతో తృణమూల్ శ్రేణులు కాస్త నిరాశలో ఉండిపోయారు. ఆరో రౌండ్ ఫలితం వెలువడిన వెంటనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మళ్లీ అధికారంలో రానుంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 146 స్థానాలు కావాల్సి ఉండగా, 200కి పైగా స్థానాల్లో తృణమూల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టే దిశగా ఆ పార్టీ దూసుకుపోతోంది.