West Bengal Election Results 2021: మ‌మ‌త వెనుకంజ‌.. 4557 ఓట్ల ఆధిక్యంలో..

West Bengal Election Results 2021: దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Update: 2021-05-02 05:15 GMT

West Bengal Election Results 2021: మ‌మ‌త వెనుకంజ‌.. 4557 ఓట్ల ఆధిక్యంలో..

West Bengal Election Results 2021: దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌పైనే అందరి దృష్టి ఉంది. దేశ రాజకీయాల్లో తమకు ఎదురు లేదని చాటాలనుకుంటున్న బీజేపీకి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కంట్లో నలుసుగా మారడం, ఆమెను ఓడించేందుకు కాషాయ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేశారు.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్‌ రౌండ్‌కు ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రాంలో ఆమె వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్‌ ముగిసే సమయానికి మమతపై ఆమె సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి సువేందు అధికారి 4557 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News