West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌లో ఏడో విడుత పోలింగ్

West Bengal Election 2021: భవానీపూర్‌తో సహా మరో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

Update: 2021-04-26 06:43 GMT
బెంగాల్ ఎన్నికలు (ఫైల్ ఇమేజ్)

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌లో ఏడో విడుత పోలింగ్‌ కొనసాగుతోంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్‌తో సహా మరో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 284 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 86లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

ముర్షిదాబాద్‌, పశ్చిమ్‌ బర్ధమాన్‌ జిల్లాల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 12వేల 68 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ కొనసాగుతుంది. అదేవిధంగా, దక్షిణా దినాజ్‌పూర్‌, కోల్‌కతాలో నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ భారీ భద్రత ఏర్పాటు చేసింది.

ఎన్నికల్లో కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు అందుబాటులో ఉంచడంతో పాటు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో ఎనిమిది విడుతలుగా పోలింగ్‌ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆరు విడుతల పోలింగ్‌ పూర్తయింది.

Tags:    

Similar News