West Bengal Deputy Magistrate Dies of Covid19: కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి

West Bengal Deputy Magistrate Dies of Covid19: ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ దీనికి బలి .

Update: 2020-07-14 10:08 GMT
Representational Image

West Bengal Deputy Magistrate Dies of Covid19: ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ దీనికి బలి అవుతున్నారు.తాజాగా పచ్చిమబెంగాల్ లో హుగ్లీ జిల్లాలోనిచంద‌న్ న‌గ‌ర్ స‌బ్ డివిజ‌న్ కు చెందిన డిప్యూటీ క‌లెక్టర్ దేబ్ ద‌త్తా రాయ్(38) క‌రోనాతో క‌న్నుమూశారు. మొదట ఆమెకి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెను హోం క్వారంటైన్ లోనే ఉండాలని వైద్యులు సూచించారు. అయితే గత ఆదివారం ఉదయం ఆమెకి శ్వాసకి సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆమెను రాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆమె మరణం పట్ల ఆమె తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క‌రోనా స‌మ‌యంలో హుగ్లీ జిల్లాకు రైళ్లల్లో వ‌చ్చిన కార్మికుల‌ను క్వారంటైన్ కు త‌ర‌లించే బాధ్యత‌ను దేబ్ ద‌త్తా రాయ్ నిర్వహించారు. అయితే అదే సమయంలో ఆమెకి కరోనా సోకి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆమె మృతి పట్ల పచ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమైన సేవలను అందించిన ఆమె మన మధ్య ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరం అని ఆమె అన్నారు. ఇక రాష్ట్రంలో కరోనాతో ఓ సీనియర్ అధికారి మృతి చెందడం ఇదే మొదటిసారి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక క‌లెక్టర్ దేబ్ ద‌త్తా రాయ్ కి భర్త, నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.



ఇక దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 9,06,752కు చేరుకుంది. అయితే ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా, 5,71,460 మంది కొలుకున్నారు..అటు కరోనాతో పోరాడి 23,727 మంది మృతి చెందారు.

Tags:    

Similar News