Mamata Benarjee: కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా విమర్శలు

* ఇటలీ శాంతి సమావేశానికి వెళ్లేందుకు నో చెప్పెన కేంద్రం * ఇటలీ పర్యటన రద్దు చేసుకోవాల్సిందిగా కేంద్రం విజ్ఞప్తి

Update: 2021-09-25 17:00 GMT

బెంగాల్ సీఎం మమతా (ఫోటో: ది హన్స్ ఇండియా)

Mamata Benarjee: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాట్ కామెంట్స్ చేశారు. ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ సర్కార్ తనకు అనుమతి నిరాకరించిందని ఫైర్ అయ్యారు. ఇటలీలో అక్టోబర్‌లో జరిగే శాంతి సమావేశాలకు నిర్వహకులు మమతాను ఇన్వైట్ చేశారు. అయితే, ప్రతినిధులతో కలిసి రావొద్దని ఇటలీ అధికారులు కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో తన పర్యటనకు అనుమతివ్వాల్సిందిగా విదేశీ వ్యవహారాల శాఖను మమతా కోరారు.

అయితే దీదీ విజ్ఞప్తిని కేంద్రం నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే హోదాకు అనుగుణంగా ఆ కార్యక్రమం జరగడంలేదంది. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన దీదీ కేంద్రం కావాలనే తనపై కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తన ఇటలీ పర్యటనను అడ్డుకోవడం మీ తరం కాదంటూ కేంద్రానికి సవాల్ విసిరారు.

Tags:    

Similar News