Babul Supriyo: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి బిగ్ షాక్
* టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో * మంత్రివర్గ విస్తరణకు ముందే పదవికి రాజీనామా చేసిన సుప్రియో
West Bengal: పశ్చిమ బెంగాల్ భవానీపూర్ బైపోల్‌కు ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరి బీజేపీకి షాకిచ్చారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందే బాబుల్ సుప్రియో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా టీఎంసీలో చేరడం వెస్ట్ బెంగాల్ బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది.