West Bengal: శాసనమండలి ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం
ఎమ్మెల్యేగా గెలవకుండానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమత మరో నాలుగు నెలల్లో దీదీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి
West Bengal: వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ శాసనమండలి ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం జరిగింది. గత ఎన్నికల్లో సువేందుపై ఓడిన మమత ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో మరో నాలుగు నెలల్లో మమత ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మండలి ఏర్పాటుకు తీర్మానం జరిగింది. అయితే ఈ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అయిన వేళ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది.