Heavy Rains in Delhi: దేశరాజధానిలో కుండపోత వర్షం.. నేలమట్టమైన ఇల్లు
Heavy Rains in Delhi: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరం అంతా అతాలకుతలం అవుతుంది.
Heavy Rains in Delhi: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరం అంతా అతాలకుతలం అవుతుంది. భారీగా వర్షం కురవడంతో ఆ వరదనీరంతా పట్టణ ప్రధాన రహదారులపై చేరడంతో రహదారులన్నీ వాగులు, చెరువులు, తలపిస్తున్నాయి. అంతే కాదు ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో ఇండ్లు ఈ వరద బీభత్సానికి తట్టుకోలేక కొట్టుకుపోయాయి. ఇక ఈ వరదల తాకిడికి అన్నానగర్‌లోని ఐటీవో సమీపంలో ఒక ఇళ్లు పూర్తిగా నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు భారీగా కురిసిన వర్షానికి ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే మృతి చెందగా, వారిలో ఒకరి మృత దేహం వరద నీటిలో తేలియాడాతూ కొట్టుకుపోయింది. కొంత మంది ఈ సన్నివేషాన్ని తమ సెల్ ఫోన్లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఆదివారం ఉదయం నుంచి ఢిల్లీ వర్షం దంచి కొడుతుంది. సఫ్దార్‌గంజ్ ప్రాంతంలో 4.9 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, పాలెం ప్రాంతంలో 3.8 మి.మీ. వర్షం కురిసింది. ఇక ఇదే తరహాలో మరో రెండు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హరియాణ, ఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అప్పటికే చాలా మంది ఆ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఘజియాబాద్, ఫరిదాబాద్ ఆదంపూర్, హిస్సార్, హన్సి, జింద్, గోహానా, గనౌర్, బరూత్, రోహ్‌తక్, సోనిపట్, బాగ్‌పాట్, గురుగ్రామ్, నొయిడా, ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
#WATCH Delhi: A bus got stuck in a waterlogged road under Minto Bridge following heavy rainfall in the national capital this morning. pic.twitter.com/OhwpyIU2Sz
— ANI (@ANI) July 19, 2020