Weather: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
Weather: మే 24 నాటికి తుపాను నుంచి అతి తీవ్ర తుపానుగా బలపడే ఛాన్స్
Weather: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతోంది. రాగల కొన్ని గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఉత్తర - వాయువ్య దిశగా కదిలి బలపడి మే 24 నాటికి తుపానుగా, తరువాతి 24 గంటల్లో అతి తీవ్రమైన తుపానుగా మారనుంది. ఉత్తర - వాయువ్య దిశగా కదులుతూ.. మరింత బలపడి, పశ్చిమ బెంగాల్ సమీపంలోని ఉత్తర బంగాళాఖాతానికి, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు 26వ తేదీ ఉదయం చేరుకుంటుంది.
ఇక.. అదేరోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దాని పక్కనే ఉన్న ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది. దీంతో.. తెలంగాణలో రానున్న రెండ్రో రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.