Ration‌ Card: రేషన్‌ కార్డుదారులకి హెచ్చరిక.. అలా చేస్తే మీ కార్డు రద్దు..!

Ration‌ Card: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి.

Update: 2022-05-03 09:30 GMT

Ration‌ Card: రేషన్‌ కార్డుదారులకి హెచ్చరిక.. అలా చేస్తే మీ కార్డు రద్దు..!

Ration‌ Card: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. వాస్తవానికి కరోనా సమయంలో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ విధానాన్ని ప్రారంభించింది. అయితే ఈ ఉచిత రేషన్‌ కూడా లక్షలాది మంది అనర్హులు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అలాంటి వారి రేషన్ కార్డుని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వెరిఫికేషన్ తర్వాత ఆహార శాఖ బృందం వారి కార్డులని రద్దు చేస్తుంది. అంతేకాదు వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి

ఒక వ్యక్తికి 100 చదరపు మీటర్ల ప్లాట్ లేదా ఇల్లు, నాలుగు చక్రాల వాహనం లేదా ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామంలో రెండు లక్షలు, నగరంలో సంవత్సరానికి మూడు లక్షల కంటే ఎక్కువ ఉంటే అతడు రేషన్‌ కార్డుకి అనర్హుడు. అలాంటి వారు రేషన్ కార్డు కలిగి ఉంటే వెంటనే దానిని తహసీల్ లేదా DSO కార్యాలయంలో సరెండర్ చేయాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌కార్డుదారుడు కార్డును సరెండర్ చేయకుంటే తనిఖీ తర్వాత అలాంటి కార్డును రద్దు చేస్తారు. దీంతో పాటు ఆ కుటుంబంపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు తీసుకున్న రేషన్ కూడా రికవరీ చేస్తారు.

Tags:    

Similar News