Pan Card: పాన్‌కార్డులో ఫొటో అస్పష్టంగా ఉందా.. ఇలా మార్చుకోండి..!

Pan Card: ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాలలో పాన్ కార్డ్ ఒకటి.

Update: 2022-04-05 09:18 GMT

Pan Card: పాన్‌కార్డులో ఫొటో అస్పష్టంగా ఉందా.. ఇలా మార్చుకోండి..!

Pan Card: ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాలలో పాన్ కార్డ్ ఒకటి. ప్రతి చోట దీని అవసరం ఉంటుంది. ఆస్తి కొనుగోలు నుంచి నగలు కొనడం, బ్యాంకులో ఖాతా తెరవడం, పెట్టుబడి పెట్టడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం మొదలైన పనుల వద్ద పాన్‌కార్డు అవసరం ఉంటుంది. ఇది లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు.

వాస్తవానికి పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఇది 10 సంఖ్యల ప్రత్యేక ID. ఇందులో ఆదాయం, పన్ను పూర్తి వివరాలు నమోదై ఉంటాయి. అయితే పాన్‌కార్డ్‌ను తయారు చేసేటప్పుడు చాలా సార్లు ఫోటో అస్పష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఫోటోలు సరిపోలని సందర్భంలో మీరు చాలా సార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీరు పాన్ కార్డ్ ఫోటోను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.

PAN కార్డ్‌లో అస్పష్టమైన ఫోటోను ఇలా మార్చుకోండి..

1. పాన్ కార్డ్‌లో ఫోటోను మార్చడానికి ముందుగా NDLS అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

2. ఇక్కడ మీరు అప్లికేషన్ టైప్ ఎంపికపై క్లిక్ చేయాలి.

3. ఛేంజెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మొత్తం సమాచారాన్ని నింపండి.

5. ఇక్కడ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మొదలైన అన్ని వివరాలని నమోదు చేయండి.

6. తర్వాత Captcha ఎంటర్ చేసి submit బటన్‌పై క్లిక్ చేయండి.

7. తర్వాత మీరు KYCని పూర్తి చేయాలి.

8. తర్వాత మీరు ఫోటో మార్పు ఛేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.

9. ఆపై ID ప్రూఫ్ డిపాజిట్‌ను అప్‌లోడ్ చేసి డిక్లరేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

10. తర్వాత ఫోటోను మార్చడానికి రూ.101 డిపాజిట్ చేయాలి. మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి ఏదైనా పద్ధతి ద్వారా చెల్లింపు చేయవచ్చు.

11. తరువాత 15 అంకెల సంఖ్య వస్తుంది.

12. దీనిని ప్రింట్ తీసి ఉంచుకోండి.

13. ఈ నంబర్‌ను ఆదాయపు పన్ను పాన్ సేవల యూనిట్‌కు పంపండి.

14. మీ ఫోటో PANలో అప్‌డేట్ చేస్తారు. 

Tags:    

Similar News